![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-98 లో.. కన్నా ఏడుస్తుంటే కేశవ నచ్చజెప్పుతాడు. ఇక మాధవ కన్నాకి సపోర్ట్ గా మాట్లాడతాడు. అదే సమయంలో మాధవని పెళ్ళిచేసుకోవడానికి సిద్ధపడిన కవిత కాల్ చేస్తుంది. అయితే పెద్ది కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తను మాహాకి కాల్ చేస్తుంది. ఇక మహా ఫోన్ ని మాధవకి ఇచ్చి మాట్లాడమంటుంది. బలవంతంగా మాధవ ఫోన్ మాట్లాడుతుంటే చక్రి, మహా, కన్నా, కేశవ చూస్తుంటారు. మరుసటి రోజు చక్రి తను పనిచేసే కార్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ యూనివర్సిటీలో జాబ్ చేసే మేడమ్ ని పికప్ చేసుకోని వెళ్తుంటాడు. ఏంటి చక్రి చాలారోజుల వరకు కనపడలేదు.. ఎటు మాయమయ్యావని ఆమె అడుగుతుంది.
ఇక చక్రి జరిగిందంతా చెప్తాడు. మహా సర్టిఫికేట్లు వాళ్ళ నాన్న కాల్చేశాడని , తనకి హెల్ప్ చేయమని చక్రి అడుగగా.. సరేనని ఒకరోజు మహాని యూనివర్సిటీకి తీసుకురమ్మని ఆవిడ చెప్తుంది. సరేనని చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు మాధవ వాళ్ళ నాన్నకి పెళ్ళిచూపుల పనులు అప్పజెప్తుంది మహా. ఇక కన్నా ఎమోషనల్ అవుతాడు. వదిన మాధవ అన్నయ్య చేసుకోబోయే వదిన కూడా మీలాగా మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటుందా అని కన్నా అనగానే తను కూడా నాలాగే మీతో కలిసిపోతుందిరా ఏడ్వకు.. మీరంతా హ్యాపీగా ఉంటారని మహా అంటుంది. మీరంతా అంటే మాధవ అన్నయ్య పెళ్ళి అయ్యాక మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని కన్నా ఏడుస్తాడు. లేదురా అని మహా అంటున్నా కన్నా ఏడుస్తూనే ఉంటాడు. మీరు మాతో పాటే ఉండండి వదిన అని కన్నా ఏడుస్తూ అడిగేసరికి మహా సరేనని అంటుంది.
ఆ తర్వాత మాధవకి పెళ్ళిచూపుల కోసం మహా, చక్రి, కన్నా, కేశవ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక కవిత మరియు వాళ్ళ పేరెంట్స్ పెళ్ళి చూపులకి పూజారితో వస్తారు. ఇక అన్నీ మాట్లాడుకున్నారుగా అని పూజారి అనగానే హా అన్నీ మాట్లాడుకున్నామని చక్రి అంటాడు. మరి అమ్మాయి తరుపు వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి మీ అన్నయ్యకి చెప్పారా అని పూజారి అనగానే మహా, చక్రి, కేశవ, కన్నా, నారాయణ షాక్ అవుతారు. మహా ఏంట్రా కండిషన్ అని అడుగగా చక్రి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత తాంబూలాలు మార్చుకొని, వచ్చేనెల మూడో తేది పెళ్ళి అని కన్ఫమ్ చేసుకొని కవిత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కన్నా ఎమోషనల్ అవుతాడు. మహా ఓదారుస్తుంది. ఇక ఎప్పటిలాగే కేశవ, చక్రి గొడవపడతారు. మహా వచ్చి మీరు మారరు అని అనేసరికి ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్తారు. మరుసటి ఎపిసోడ్ లో మాధవ బయట నుండి ఇంట్లోకి వస్తాడు. ఎవరు పిలిచినా మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఇక అందరు డోర్ కొడుతుంటే మాధవ డోర్ తీస్తాడు. బ్యాగ్ తో రెడీ అయి బయటకు వస్తాడు. ఏంటన్నయ్యా అని అందరు అడుగగా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా అని మాధవ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |